Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాలీవుడ్ సినిమా టైటిల్‌తో తెరకెక్కుతున్న తెలుగు చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్'. ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం తాప్సీని ఎంపిక చేశారని సమాచారం. త్వరలోనే హైదరాబాద్‌లో ఆరంభమయ్యే షెడ్యూల్లో తాప్సీ పాల్గొనబోతుందంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమా చిన్న చిత్రంగా విడుదలై, పెద్ద సినిమాల స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్ర దర్శకుడు స్వరూప్‌కి మంచి గుర్తింపు లభించింది. తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్'. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఉండే ట్విస్టులు ప్రేక్షకుల్ని బాగా థ్రిల్ చేస్తాయని చిత్ర బృందం భావిస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. 'గేమ్ ఓవర్' తర్వాత తాప్సీ తెలుగులో నటిస్తున్న చిత్రమిది. 'హసీన్ దిల్రుబా', 'జనగణమణ', 'రష్మి రాకెట్', 'లూప్ లపేటా', 'దోబారా', 'శభాష్ మిథు' వంటి తదితర బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ తాప్సీ ప్రస్తుతం బిజీగా ఉంది. వీటిల్లో 'రష్మి రాకెట్',
'శభాష్ మిథు' రెండూ క్రీడా నేపథ్య సినిమాలు కావడం విశేషం.