Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నితిన్ హీరోగా నటిస్తున్న 30వ చిత్రం 'మాస్ట్రో'. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రైమ్ కామెడీ చిత్రంలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్గా నటిస్తోంది. మరో హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. హీరో నితిన్, తమన్నాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ చిత్రీకరణతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్ షురూ చేసిన తొలి టాలీవుడ్ సినిమా 'మాస్టో' కావడం విశేషమని చిత్ర బృందం తెలిపింది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.