Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎట్టకేలకు బాలీవుడ్లో సినిమా షూటింగ్‌లు మొదలయ్యాయి. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సోమవారం ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టడంతో, కొన్ని నిబంధనలతో సినిమా చిత్రీకరణలు మేకర్స్ ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బి షూటింగ్‌కి వెళ్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ, మాస్క్ ధరించిన ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. 'సమయం ఉదయం 7 గంటలు. పని కోసం వెళ్తున్నాను. లాక్డౌన్ 2.0 తర్వాత తొలిసారి షూటింగ్లో పాల్గొంటున్నాను. రోజురోజుకి పరిస్థితులు చక్కబడుతున్నాయి' అని అమితాబ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అమితాబ్ ప్రస్తుతం 'మేడే', 'గుడ్ బై' చిత్రాల్లో భిన్న పాత్రలు పోషిస్తున్నారు.