Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భాషల్లో త్వరలో విడుదల కానున్న లోకి గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ముందుగా చూడవలసిన గాడ్ ఆఫ్ మిశ్చీఫ్ జాబితాలోని అన్ని సినిమాలను చూసేయండి
- మార్వెల్ క్యారెక్టర్ లోకి కనిపించిన అనిన సినిమాలను వీక్షించేందుకు, గాడ్ ఆఫ్ మిస్చీఫ్ ఏమిటో తెలుసుకునేందుకు ఇదే సరైన సమయం
క్రాస్-టైమ్‌లైన్, రియాలిటీ-బెండింగ్, యాక్షన్-ప్యాక్డ్ అడ్వెంచర్ కోసం గాడ్ ఆఫ్ మిస్చీఫ్‌ను వీక్షించేందుకు సిద్ధంగా ఉండండి. అవును, డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియంలో జూన్ 9 నుంచి ఇంగ్లీషులో, డిస్నీ+హాట్‌స్టార్‌లో హిందీలోప్రసారమవుతున్న లోకి చూడండి. తెలుగు మరియు తమిళ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని- డిస్నీ+ హాట్‌స్టార్ విఐపి త్వరలో దీన్ని ప్రసారం చేయనుంది. ఎవెంజర్స్: ఎండ్గేమ్లో సంఘటనల తరువాత, నటుడు టామ్ హిడిల్స్టన్ మరోసారి మాస్టర్ మానిప్యులేటర్, ఇతరులు తన కోసం పోరాటం చేసేలా మోసగిస్తూ ఆనందించే లోకిగా టైటిల్ క్యారెక్టర్ పోషించాడు, ఈ అసాధారణ ప్రవర్తన కలిగిన యాంటీ హీరో గురించి మరింత తెలుసుకోవాలన్న ఆసక్తి మీకు ఉంటే, లేదా లోకి విడుదల కన్నా ముందుగానే మీ జ్ఞాపకాలను రిఫ్రెష్ చేసుకోవాలంటే, మీరు తప్పక చూడవలసిన ఆరు టైటిల్స్- డిస్నీ+ హాట్‌స్టార్ విఐపిలో హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో అందుబాటులో ఉన్నాయి.
థోర్
శక్తివంతుడైనప్పటికీ, నిర్లక్ష్యాన్ని చూపించే దేవుడు థోర్ మిడ్‌గార్డ్ (భూమి)పై మానవుల మధ్య నివసించేందుకు అస్గార్డ్ను తరిమివేయగా, అక్కడ అతను త్వరలోనే వారికి అత్యంత ప్రత్యర్థుల్లో ఒకనిగా మారిపోతాడు.
మార్వెల్స్ ది ఎవెంజర్స్
విశ్వాన్ని విపత్తు అంచు నుంచి వెనక్కు తీసుకు వచ్చేందుకు తనకు ఒక జట్టు అవసరం ఉందని నిక్ ఫ్యూరీ తెలుసుకుని అవెంజర్స్‌ను క్రియాశీలకంగా మార్చుతాడు.
థోర్: ది డార్క్ వరల్డ్
తొమ్మిది రాజ్యాలను నాశనం చేయాలనే తన కోరికను నెరవేర్చుకునేందుకు అస్గార్డ్ తిరిగి వచ్చినప్పుడు డార్క్ ఎల్వ్స్ నాయకుడు మలేకిత్ను ఓడించేందుకు థోర్ ఒక ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు.
థోర్: రాగన్రాక్
తన శక్తివంతమైన సుత్తి మోల్నిర్ను కోల్పోయిన థోర్, మరణ దేవత హేలా నుంచి తన ఇల్లు, అస్గార్డ్ను కాపాడుకునేందుకు విశ్వంలో మరో అంచు నుంచి తప్పించుకోవలసి ఉంటుంది.
ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్స్
విశ్వాన్ని విధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్న శక్తివంతమైన థానోస్‌ను అడ్డుకునేందుకు ఎవెంజర్స్ ప్రతి దానితో రిస్క్ తీసుకోవలసి ఉంటుంది.
ఎవెంజర్స్: ఎండ్‌గేమ్
ఇన్ఫినిటీ వార్తో జరిగిన వినాశకరమైన సంఘటనల తరువాత, థానోస్ దాడులను తిప్పికొట్టేందుకు, విశ్వంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎవెంజర్స్ మరోసారి సమావేశమవుతారు. మీకు ఇష్టమైన మార్వెల్స్ సూపర్ హీరోస్‌కు చెందిన అన్ని టైటిల్స్‌ను మరియు యాంటీ-హీరో లోకిని డిస్నీ+హాట్‌స్టార్ ప్రీమియంలో ఇంగ్లీషు మరియు హిందీలో, డిస్నీ+హాట్‌స్టార్ విఐపిలో హిందీలో చూడండి మరియు తమిళం మరియు తెలుగు భాషల్లో త్వరలో విడుదల కానుంది!