Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథానాయికగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమన్నా ఇకపై బుల్లితెర ప్రేక్షకుల్ని కూడా అలరించబోతోంది. జెమినీ ఛానెల్ కోసం రూపొందించిన మాస్టర్ చెఫ్ తరహా వంటల పోటీ కార్యక్రమానికి జడ్జ్‌గా తమన్నా కనిపించనుందట.ఈ కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకుల్ని ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్ని తమన్నా మెస్మరైజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించిన పబ్లిసిటీని కూడా సదరు ఛానెల్ ప్రతినిధులు వినూత్నంగా చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారట. ఇటీవల 'లెవెన్త్ అవర్', 'నవంబర్ స్టోరీస్' వంటి వెబ్ సిరీస్‌లతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది తమన్నా. అయితే ఈ రెండు వెబ్ సిరీస్‌లూ ప్రేక్షకుల నిరాదరణతో డిజాస్టర్లుగా నిలిచాయి. ఇలాంటి నేపథ్యంలో తమన్నా బుల్లితెర ఎంట్రీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇదిలా ఉంటే, తమన్నా ప్రస్తుతం 'ఎఫ్3', 'మాస్ట్రో', 'సీటీమార్', 'గుర్తుందా శీతాకాలం', 'భోలే చుడియన్' వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.