Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సెకండ్ వేవ్ చేసిన విలయతాండవం వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మరణం తాలూకా భయం ప్రజల్లో ఇంకా తిట్టవేసి ఉంది. ఇలాంటి టైమ్లో థియేటర్లని తెరిస్తే ప్రేక్షకులు వస్తారో రారో కూడా తెలీదు. పైగా 50 శాతం ఆక్యూపెన్సీకి మాత్రమే అనుమతి ఉంది. అయినప్పటికీ తాను నటించిన కొత్త చిత్రం 'బెల్ బాటమ్'ను జూలై 27న థియేటర్లలోనే విడుదల చేస్తున్నట్టు సోషల్ మీడియో వేదికగా అక్షరు కుమార్ ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారనే పుకార్లకూ ఫుల్స్టాప్ పెట్టాడు. స్పై థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంలో వాణీ కపూర్, హ్యూమా ఖురేషీ, లారా దత్తా కీలక పాత్రలు పోషించారు. రంజిత్ ఎం.తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పూజ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. సెకండ్ వేవ్ నేపథ్యంలో థియేటర్లలో రిలీజ్ అవ్వబోతున్న తొలి బాలీవుడ్ సినిమా 'బెల్ బాటమ్' కావడం విశేషం.