Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశభక్తిని పెంపొందించే చిత్రంగా దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు, విమర్శకుల అభినందనలు పొందిన చిత్రం 'లగాన్'. అమీర్‌ఖాన్ నిర్మాతగా మారుతూ నిర్మించిన తొలి చిత్రమిది. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలై మంగళవారంతో 20 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను కథానాయకుడు అమీర్‌ఖాన్ గుర్తుచేసుకున్నారు. 'ఈ కథని మా యూనిట్ ఎంతగా ప్రేమించిందో.. అలాగే ప్రేక్షకులూ ప్రేమించారు. అందుకే ఇదొక క్లాసిక్‌గా సినీ చరిత్రలో నిలిచిపోయింది. ప్రేక్షకులు మెచ్చిన ఈ చిత్రం ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ఆస్కార్ బరిలో నిలిచినా.. అవార్డుని దక్కించుకోకపోవడం చాలా నిరాశపర్చింది' అని అమీర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయితే 'లగాన్' సినిమా రిలీజ్ రోజునే సన్నీడియోల్ నటించిన 'గదర్.. ఏక్ ప్రేమకథ' కూడా విడుదలై సంచలన విజయం సాధించింది. పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా సిక్కు సైనికుడు బూటా సింగ్ జీవితాన్ని బేస్ చేసుకుని దర్శకుడు అనిల్‌శర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.