Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన కథానాయకులు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో నటించడానికి ప్రయత్నాలు చేస్తుంటే, తమిళ స్టార్ హీరోలు మాత్రం మన తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపటం ఆశ్చర్యకరం. ఎందుకంటే ఒకప్పుడు ఇదే స్టార్ హీరోలతో మన దర్శకులు సినిమాలు చేద్దామని చాలా ప్రయత్నాలు చేశారు. ఒక్కటీ కూడా ఫలించలేదు. అయితే ఇప్పుడు ఆదే స్టార్ హీరోలు మన దర్శకులను వెతుక్కుంటూ మరీ వస్తున్నారు. అలాగే పనిలో పనిగా టాలీవుడ్‌లోనూ తమ మార్కెట్‌ని బాగా పెంచుకోవాలని ఆరాట పడుతున్నారు. ఇందులో భాగంగా, ఇప్పటికే స్టార్ హీరో విజరు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ ఓ ప్రాజెక్ట్‌ని ఎనౌన్స్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోయే ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. అలాగే మరో అగ్ర కథానాయకుడు ధనుష్ కూడా ఓ తెలుగు స్ట్రయిట్ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక లేటెస్ట్గా మరో స్టార్ హీరో సూర్య సైతం తెలుగులోకి అడుగిడేందుకు ప్లాన్ చేస్తున్నారట. పక్కా మాస్ కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అయిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సూర్య ఓ పాన్ ఇండియా సినిమా చేసేందుకు గ్రీన్‌సిగల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమాని కూడా దిల్‌రాజునే నిర్మిస్తున్నారనే వార్తలూ చక్కర్లు కొడుతున్నాయి. బోయపాటి ప్రస్తుతం బాలకష్ణతో 'అఖండ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'అఖండ' తర్వాత అల్లు అర్జున్‌తో బోయపాటి ఓ సినిమా చేయబోతున్నారని బాగా వినిపిస్తున్న తరుణంలో తెరపైకి సూర్య, బోయపాటి సినిమా వచ్చి అందర్నీ షాకయ్యేలా చేసింది.