Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంచు మోహన్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫిల్మ్స్ బ్యానర్‌తో కలిసి విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలోని 'జయజయ మహావీర' అనే పల్లవితో సాగే తొలి లిరికల్ వీడియో సాంగ్‌ను మంగళవారం బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ విడుదల చేశారు. ఈ పాటను విడుదల చేసిన అమితాబ్ ట్వీట్ చేస్తూ, భారతీయ సినీ చరిత్రలో దిగ్గజాల వంటి హీరో మోహన్‌బాబు, సంగీత దర్శకుడు ఇళయరాజా సంయుక్తంగా భగవంతుడు శ్రీరామచంద్రుడి ఘనతకు నివాళ్ళలర్పించే రఘువీర గద్యాన్ని అద్భుతంగా సమర్పించారంటూ అభినందనలు తెలియజేశారు.
'మోహన్‌బాబుపై అత్యంత ఉద్విగభరితంగా చిత్రీకరించిన
ఈ గీతానికి ఇళయరాజా అందించిన రసవత్తరమైన ట్యూన్ అందరి మనసుల్ని స్పృశిస్తోంది.
డా|| మోహన్‌బాబు నటించిన చిత్రగీతాన్ని నేషనల్ వైడ్‌గా అత్యున్నత స్థాయి కథానాయకుడైన అమితాబ్ విడుదల చేయడం ఓ విశేషమైతే, వ్యక్తిగతంగా ట్వీట్ చేసి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయడం మరో ప్రత్యేక ఆకర్షణగా అందరి దష్టిని ఆకట్టుకోవడం మరో విశేషం. అలాగే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానంతో విడుదలైన టీజర్ కూడా సోషల్‌మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యింది. మోహన్‌బాబు ఈ సినిమాలో హీరోగానే కాకుండా అదనంగా స్క్రీన్‌ప్లే బాధ్యతను కూడా నిర్వహిస్తున్నారు. ప్రముఖ తారాగణం ప్రధాన పాత్రలను పోషించిన ఈ చిత్రం మోహన్‌బాబు మార్కు డైలాగులు, యాక్షన్ ఎపిసోడ్స్, ఊహించని మలుపులతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తుది మెరుగులు దిద్దుకుంటోంది' అని చిత్ర బృందం తెలిపింది.