Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత చంద్రశేఖర్ (98) కన్నుమూశారు. వయో భారంతో స్వగహంలోనే బుధవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారని చంద్రశేఖర్ తనయుడు, నిర్మాత అశోక్ శేఖర్ తెలిపారు. 'రామాయణ్' ధారావాహికతో నటుడిగా మంచి గుర్తింపు పొందిన చంద్రశేఖర్ దర్శకుడిగా, నిర్మాతగానూ ప్రేక్షకుల్ని మెప్పించారు.
హైదరాబాద్‌లో పుట్టిన చంద్రశేఖర్ తొలుత జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించారు. 'సురంగ్' చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. 'కవి', 'మస్తానా', 'బసంత్ బహార్', 'కాలీ టోపీ.. లాల్ రుమాల్', 'గేట్ ఆఫ్ ఇండియా', 'ఫ్యాషన్', 'ధర్మ', 'డ్యాన్స్ డ్యాన్స్', 'లవ్ లవ్ లవ్' తదితర సినిమాల్లో భిన్న పాత్రలు పోషించి అలరించారు. దాదాపు 250కిపైగా చిత్రాల్లో ఆయన నటించారు. 1964లో స్వీయ నిర్మాణంలో 'ఛ ఛ ఛ' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. 1966లో 'స్ట్రీట్ సింగర్' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. రామానంద్ సాగర్ దర్శకత్వంలో రూపొందిన 'రామాయణ్ సీరియల్‌తో ఆర్య సుమంత్ పాత్రతో విశేషంగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించిన చంద్రశేఖర్‌కి ముగ్గురు కుమారులు ఉన్నారు.