Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా 'లవ్‌స్టోరీ' సినిమా విడుదలను మేకర్స్ వాయిదా వేసిన విషయం విదితమే. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితి ఏర్పడుతుండటంతో వచ్చే నెలలో థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను రన్ అవ్వబోతున్న నేపథ్యంలో 'లవ్‌స్టోరీ' సినిమా రిలీజ్‌పై పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. వీటిపై నిర్మాత సునీల్ నారంగ్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. 'తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే మా సినిమాని థియేటర్లలో విడుదల చేస్తాం. అలాగే థియేటర్లలో రోజుకు 3 ప్రదర్శనలకు మాత్రమే అనుమతిస్తే మాత్రం మా సినిమా రిలీజ్‌ని వాయిదా వేస్తాం. జూలై రెండవ వారం తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని భావిస్తున్నాం. మా సినిమా విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం' అని నిర్మాత సునీల్ నారంగ్ తెలిపారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రానికి శేఖర్‌కమ్ముల దర్శకుడు.