Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర కథానాయిక రకుల్ ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'త్రిశంకు'. ప్రాచి తెహ్లాన్, రష్మీ గౌతమ్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సుమన్, మహేష్ ఆచంట, నవీన రెడ్డి కీలకపాత్రధారులు. శ్రీ కష్ణ గొర్లె దర్శకుడు. గణేశ్ క్రియేషన్స్, ఎ.యు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై లండన్ గణేష్, నల్ల అయ్యన్న నాయుడు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ 'ఏడు రంగుల ఓ ఇంద్రధనస్సులా'ను హీరో రానా రిలీజ్ చేసి, చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ పాటకి సునీల్ కశ్యప్ స్వరాలు సమకూర్చారు. భాష్యశ్రీ సాహిత్యం అందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ కష్ణ గొర్లె మాట్లాడుతూ,' ఈ సినిమా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి పాత్ర ఎంతో చక్కగా రూపుదిద్దుకుంది. అడగ్గానే ఈ చిత్రంలోని పాటను విడుదల చేసిన హీరో దగ్గుబాటి రానా గారికి కృతజ్ఞతలు. రాహుల్ సిప్లిగంజ్ పాడిన 'ఏడు రంగుల..' పాటకు సర్వత్రా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట సినిమాకి హైలెట్ అవ్వనుంది. శ్రోతల్ని మెప్పించేలా సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ క్యాచీ ట్యూన్సు అందించారు. ఈ సినిమా మేకింగ్ విషయంలో మా నిర్మాతలు ఎక్కడా రాజీపడటం లేదు. అందరి సహకారంతో సినిమా అవుట్‌ఫుట్ చాలా బాగా వస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే చిత్రమిది' అని చెప్పారు. నిర్మాతలు లండన్ గణేష్, నల్ల అయ్యన్న మాట్లాడుతూ,'దర్శకుడు శ్రీ కష్ణ చెప్పిన పాయింట్ మాకెంతో బాగా నచ్చింది. ఈ సినిమాలో మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా చాలా బాగా వచ్చింది. మా చిత్రంలోని తొలి పాటను విడుదల చేసిన రానా గారికి కతజ్ఞతలు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను తెలియజేస్తాం' అని తెలిపారు. ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్: హరి అయినీడి.