Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన సినిమాల్లో 'జాతిరత్నాలు' చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొంది, అఖండ విజయం సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లోనూ ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. కరోనా ఫస్ట్‌వేవ్ సమయంలోనే థియేటర్లలో రిలీజై బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 100 కోట్లకి పైగా కలెక్ట్ చేసి చిన్న సినిమాల్లోనే
పెద్ద సినిమాగా నిలిచింది. దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా మారుతూ నిర్మించిన తొలి చిత్రమిది. ఈ సినిమాలో చిట్టిగా కథానాయిక ఫరియా అబ్దుల్లా
ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. వెండితెరకు కొత్త అయినప్పటికీ తెలంగాణ యాసతో అందర్నీ మెప్పించింది. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శన్
వంటి అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న నటులు ఉన్నప్పటికీ ఫరియా తనదైన శైలిలో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. థియేటర్ ఆర్టిస్ట్‌గా వెండితెరంగేట్రం చేసి, తొలి ప్రయత్నంలో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్న ఫరియాకి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. అయితే వచ్చిన ప్రతి ఆఫర్కీ పచ్చజెండా ఊపకుండా, కథ నచ్చిన సినిమాని మాత్రమే అంగీకరిస్తోంది. ఈ నేపథ్యంలో 'ఢ' సీక్వెల్లో ఫరియా నటించబోతోందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మంచు విష్ణు, శ్రీనువైట్ల కాంబినేషన్లో రూపొంది, సంచలన విజయం సాధించిన చిత్రం 'ఢ'. మళ్ళీ అదే కాంబోలో ఈ చిత్ర సీక్వెల్‌ని తెరకెక్కించబోతోన్నారు. ఇందులో మంచు విష్ణు సరసన ఫరియాని ఎంపిక చేసినట్టు సమాచారం. మంచు విష్ణు ప్రస్తుతం తన తండ్రి మోహన్‌బాబు నటిస్తున్న 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.