Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే నాయికలకు బాలీవుడ్ సాదర స్వాగతం పలుకుతోంది. ఇందులో భాగంగానే రష్మిక మందన్న మాదిరిగానే సాయిపల్లవికి కూడా ఓ బంపర్ ఆఫర్ దక్కిందని సమాచారం. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన వివరాలను చాలా గుట్టుగా ఉండేలా నిర్మాణ సంస్థ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో ఈ సినిమాలో సాయిపల్లవి ఏ స్టార్‌కి జోడీగా నటించనుంది?, దర్శకుడు ఎవరు? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లభించలేదు. అయితే ఈ సినిమాతో సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ మాత్రం ఖాయమన్నట్టు తెలుస్తోంది. సాయి పల్లవి నటించిన 'లవ్ స్టోరి', 'విరాట పర్వం' చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అలాగే నాని 'శ్యామ్ సింగ రారు' చిత్రంలో ఓ కథానాయికగా నటిస్తోంది.