Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా స్థాయి సినిమా 'పొన్నియన్ సెల్వన్'. కల్కి కష్ణమూర్తి రాసిన 'పొన్నియన్ సెల్వన్' నవల ఆధారంగా ఆయన దీన్ని తెరకెక్కిస్తున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్, అమితాబ్, ఐశ్వర్యరారు, త్రిష, నయనతార, విజరు సేతుపతి, ఐశ్వర్యలక్ష్మి, మోహన్‌బాబు, జయరామ్ వంటి హేమాహేమీలు నటిస్తున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. మేజర్ టాకీపార్ట్ బ్యాలెన్స్‌ని పూర్తి చేయడానికి కేవలం 50 రోజులు పడుతుందని దర్శకుడు మణిరత్నం తెలిపారు. హార్స్ రైడింగ్, ఛేజింగ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో వీటిని థారులాండ్, మధ్యప్రదేశ్, కేరళలో చిత్రీకరణ జరపటానికి ప్లాన్ చేస్తున్నారు. ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది.