Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది సాయికుమార్ హీరోగా నటించబోయే నూతన చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. 'నాటకం' చిత్రాన్ని తెరకెక్కించిన కళ్యాణ్ జీ గోగణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్4గా ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సునీల్ ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, 'మా విజన్ సినిమాస్ పతాకంపై ఆది సాయి కుమార్ హీరోగా ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో డైరెక్టర్ చెప్పిన కథ నచ్చింది. ఆదిని మరో కొత్త డైమన్షన్‌లో ప్రెజంట్ చేసే చిత్రమిది. అలాగే హీరో సునీల్‌గారు మా చిత్రంలో ఓ కీ రోల్లో కనిపించబోతున్నారు. అదేంటనేది సినిమా చూడాల్సిందే. ప్రాతకి ఉన్న ప్రాముఖ్యం వల్ల సునీల్‌గారైతే బావుంటుందని, ఆయన్ని అడగ్గానే నటించడానికి అంగీకరించినందుకు స్పెషల్ థాంక్స్. ఈ చిత్రాన్ని మా బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం. ఎన్నో చిత్రాలకు సక్సెస్ఫుల్ మ్యూజిక్‌ని అందించిన సాయికార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే షూటింగ్‌ని ప్రారంభించబోతున్నాం' అని చెప్పారు.
'దర్శకుడు కళ్యాణ్ చెప్పిన కథ చాలా వినూత్నంగా ఉంది. ఇప్పటివరకు కనిపించని రీతిలో ఈ సినిమాలో కనిపిస్తాను. నా పాత్రను దర్శకుడు మలిచిన తీరు చాలా బాగుంది. ఓ మంచి సినిమాలో నటిస్తున్నందుకు హ్యాపీగా ఉంది' అని హీరో ఆది సాయికుమార్ అన్నారు.
ఈ చిత్రానికి నిర్మాత: నాగం తిరుపతి రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తిర్మల్ రెడ్డి యాళ్ల, సంగీతం: సాయికార్తీక్, ఎడిటింగ్: మణికాంత్, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి, దర్శకుడు: కళ్యాణ్ జీ గోగణ.