Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కేజీఎఫ్' సాధించిన అఖండ విజయంతో కథానాయకుడు యష్ రేంజ్ మారిపోయింది. ఆయన ఎంచుకుంటున్న సినిమాలు సైతం 'కేజీఎఫ్' మాదిరిగానే పాన్ ఇండియా స్థాయిలో ఉంటున్నాయి. ప్రేక్షకుల విశేష ఆదరణతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన 'కేజీఎఫ్' సీక్వెల్లో యష్ ప్రస్తుతం నటిస్తున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ముగింపు దశలో ఉండగానే, మరో భారీ యాక్షన్ థ్రిల్లర్‌కి యష్ గ్రీన్‌సిగల్ ఇచ్చారని సమాచారం. జీ స్టూడియోస్, హౌంబలే ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా నిర్మించబోతున్నాయి. 'ముఫ్తీ' ఫేమ్ నార్తన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. 2017లో విడుదలైన 'ముఫ్తీ' కన్నడనాట సంచలన విజయం సాధించింది. నార్తన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే నయా సినిమాలో పవర్ఫుల్ నేవీ ఆఫీసర్‌గా స్టయిలీష్ లుక్‌తో యష్ కనిపించబోతున్నారు. అలాగే యష్ సరసన తమన్నాని నాయికగా ఎంపిక చేశారని వినిపిస్తోంది. 'కేజీఎఫ్'లోని ఓ స్పెషల్ సాంగ్‌లో తమన్నా మెరిసిన సంగతి తెలిసిందే. తమన్నా ప్రస్తుతం ఈ సినిమాతోపాటు 'మాస్ట్రో', 'సీటీమార్', 'గుర్తుందా శీతాకాలం', 'ఎఫ్3', 'భోలే చుడియాన్' వంటి తదితర తెలుగు, హిందీ చిత్రాల్లోనూ నటిస్తోంది. అలాగే జెమిని ఛానెల్ రూపొందించిన వంటల పోటీ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా త్వరలోనే బుల్లితెరపై తమన్నా సందడి చేయబోతోంది.