Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధనుష్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ త్రిభాషా చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి (ఎ యూనిట్ ఆఫ్ ఏషియన్ గ్రూప్) నిర్మించనుంది. ఈ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.4గా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నారాయణ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు నిర్మాతలు.
సోనాలి నారంగ్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సునితా నారంగ్ జయంతి సందర్భంగా ప్రకటించారు. ఈ సినిమా కోసం దేశంలోనే అత్యున్నత నటీనటులు, సాంకేతిక నిపుణులతో మేకర్స్ చర్చలు జరుపుతున్నారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ఆరంభించుకోనున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు' అని చిత్ర బృందం పేర్కొంది.