Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'భీష్మ' వంటి బ్లాక్‌బస్టర్‌తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన నితిన్, రష్మిక మందన్నా జంట ప్రేక్షకుల్ని మరోసారి ఫిదా చేయబోతున్నారట. రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమాకి గ్రీన్‌సిగల్ ఇచ్చారు. నితిన్ పంథాకి పూర్తి భిన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో నితిన్ సరసన తొలుత కీర్తిసురేష్‌ని అనుకున్నారట. అయితే 'రంగ్ దే'లో వీరిద్దరి జోడి ప్రేక్షకుల్ని మెప్పించినప్పటికీ కథాపరంగా పెద్దగా ఆదరణ పొందలేదు. దీంతో బిజినెస్ రీత్యా రష్మిక అయితే బాగుంటుందనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారట. నితిన్‌తో 'భీష్మ' వంటి హిట్ సినిమాలో చేయటంతోపాటు కథ కూడా నచ్చటంతో రష్మిక ఈ సినిమాకి పచ్చ జెండా ఊపిందని బాగా వైరల్ అవుతోంది. నితిన్ ప్రస్తుతం 'మాస్ట్రో' చిత్రంలో నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది. అల్లు అర్జున్ 'పుష్ప', శర్వానంద్ 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాలతోపాటు, అమితాబ్ బచ్చన్‌తో 'గుడ్ బై', సిద్ధార్థ్ మల్హోత్రాతో 'మిషన్ మజ్ను' వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ రష్మిక బిజీగా ఉంది.