Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్, నయనతార జంటగా రూపొందిన చిత్రం 'ఆరడుగుల బుల్లెట్'. బి.గోపాల్ దర్శకత్వంలో జయ బాలజీ రీల్ మీడియా ప్రై.లిమిలెట్ పతాకంపై తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత తాండ్ర రమేష్ మాట్లాడుతూ,'కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో థియేటర్స్ ఓపెన్ కాగానే, మా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మేమే స్వయంగా రిలీజ్ చేస్తున్నాం. త్వరలోనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేసి, విడుదల తేదీని ఎనౌన్స్ చేస్తాం. గోపీచంద్, నయనతార కాంబినేషన్, బి. గోపాల్ డైరెక్షన్, ఆయన్నుంచి ప్రేక్షకులు, అభిమానులు ఆశించే అన్ని కమర్షియల్ హంగులు, వక్కంతం వంశీ కథ, మణిశర్మ మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు కానున్నాయి' అని తెలిపారు. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సిన్హా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రాఫర్: బాలమురగన్, డైలాగ్స్: అబ్బూరి రవి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రొడ్యూసర్: తాండ్ర రమేష్.