Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ చిత్రం కోసం దర్శకుడు రాజమౌళి ఓ ప్రయోగం చేయబోతున్నారని సమాచారం. 8 నిమిషాల పాటు సాగే ఓ సుదీర్ఘమైన పాటని ఎన్టీఆర్, రామ్‌చరణ్‌పై చిత్రీకరించబోతున్నారట. విజువల్ ట్రీట్‌తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయాలనే ఉద్దేశంతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ ప్రయోగానికి కథానాయకులిద్దరూ గ్రీన్‌సిగల్ ఇచ్చారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. వచ్చే నెలలో షూటింగ్‌ని పున: ప్రారంభించుకునే ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయబోతున్నారు.