Authorization
Mon Jan 19, 2015 06:51 pm
త్వరలో జరగబోయే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ బరిలో దిగబోతున్నారు. తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి తనకు పూర్తిగా అవగాహన ఉందని, వాటిని అధిగమించడానికి తన దగ్గర సరైన ప్రణాళిక ఉందన్నారు. దేశవ్యాప్తంగా 'మా'కు అత్యున్నత గౌరవం తీసుకొచ్చేందుకు తనవంతు కషి చేస్తానని, 'మా'కు ఇప్పటివరకూ సొంత భవనం లేదని, తాను అధ్యక్షుడిని అయితే సొంత భవనం నిర్మిస్తానని ప్రకాష్‌రాజ్ అన్నారు. సినీ కార్మికులకు సాయం చేయడానికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది సహదయం కలిగిన నటులు ఉన్నారని, వాళ్లందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తానని ఆయన తెలిపారు. అలాగే చిరంజీవి మద్దతు మీకు ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానంగా, 'చిరంజీవి అందరి మనిషి. ఆయన వ్యక్తిగతంగా ఏ ఒక్కరికో మద్దతు ఇవ్వరు. మంచి చేస్తారని భావించినవారికి ఆయన కచ్చితంగా మద్దతిస్తారు. అన్నయ్యతో నాకున్న సాన్నిహిత్యాన్ని దీని కోసం వినియోగించుకోను' అని ప్రకాష్‌రాజ్ తనదైన శైలిలో చెప్పారు.