Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో షూటింగ్‌లు ఆగిపోయాయి. తాజాగా లాక్‌డౌన్‌ని ఎత్తివేయడంతో టాలీవుడ్లో షూటింగ్‌ల సందడి మొదలైంది. ఇందులో భాగంగా 'ఆర్ఆర్ఆర్' సినిమా చిత్రీకరణ సోమవారం ఆరంభమైంది. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్‌తో దిగిన ఓ ఫొటోని సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ అభిమానులతో పంచుకున్నారు. 'లాక్డౌన్ ఎత్తివేయడంతో షూటింగ్స్ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం హైదరాబాద్‌లో చరణ్ హెయిర్‌స్టైల్‌తో నా రోజు ప్రారంభమైంది. మనందరికీ ఎంతో ఇష్టమైన దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' షూట్‌కి చెర్రీ సిద్ధమయ్యారు' అని అలీమ్ ట్వీట్ చేశారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురంభీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అలియాభట్, ఒలీవియా మోరీస్, అజరు దేవ్గన్, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నారు.