Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళ స్టార్ హీరో విజరు తన బర్త్‌డే సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్‌తో ఒక రోజు ముందే అభిమానుల్ని ఫుల్‌ఖుషీ చేశారు. నేడు (మంగళవారం) విజరు పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఆయన హీరోగా నటిస్తున్న 65వ చిత్రానికి సంబంధించి టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్‌ని కూడా చిత్ర బృందం రిలీజ్ చేసింది. నెల్సన్ దిలీప్ కుమార్ వహిస్తున్న ఈ చిత్రానికి 'బీస్ట్' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇక టైటిల్ పోస్టర్లో అత్యాధునిక స్నైపర్ గన్‌తో విజరు పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. 'బీస్ట్' (మృగం) టైటిల్‌తోపాటు విజరు లుక్‌తో ఇదొక పక్కా యాక్షన్ సినిమా అని వేరే చెప్పక్కర్లేదు. శత్రువులను వేటాడే మృగంగా విజరు విశ్వరూపం చూడబోతున్నామని కూడా అర్థమవుతోంది. ఇందులో విజరు సరసన పూజా హెగ్డే నటిస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌కి ముందు ఈజిప్టులో ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అలాగే విజరు బర్త్‌డే సందర్భంగా వంశీపైడిపల్లి కాంబినేషన్లో విజరు నటించబోయే నయా సినిమాకి సంబంధించి ఓ అప్డేట్ వచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది.