Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నూతన దర్శకుడు శ్రీధర్ గాదే తెరకెక్కించిన సినిమా 'ఎస్.ఆర్ కళ్యాణమండంపం ఇస్టీడీ 1975'. ఎలైట్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రమోద్ - రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని 'సిగ్గెందుకు రా మావ...' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను అగ్ర దర్శకుడు సుకుమార్ మంగళవారం విడుదల చేశారు.
'అమ్మాయిలను ప్రేమలో పడేయటం ఎలా అనే దాని గురించి హీరో తన ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకునే సందర్భంలో వచ్చే పాట 'సిగ్గెందుకు రా మావ..'.ఈ పాటలో హీరో కిరణ్ అబ్బవరం డాన్స్ మూమెంట్స్ అందర్నీ ఆకట్టు కుంటున్నాయి. సంగీత దర్శకుడు ఈ పాటకు అందించిన ట్యూన్స్, ప్రముఖ సింగర్ అనురాగ్ కులకుర్ణి అద్భుతమైన వాయిస్ వెరసి ఈ పాటని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేశాయి. ముఖ్యంగా గీత రచయిత భాస్కరభట్ల రాసిన లిరిక్స్ చాలా క్యాచీగా ఉండటం మరో ప్లస్. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ని సైతం కిరణ్ అబ్బవరం అందించడం విశేషం. విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కరోనా పరిస్థితులు సాధరణ స్థితికి వచ్చి, థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు ఈ సినిమాని విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు' అని చిత్ర బృందం పేర్కొంది.
'ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఓ అసక్తి క్రియేట్ అయ్యింది. ఆ ఉత్కంఠని మరింత పెంచుతూ విడుదల చేసిన 'చుక్కల చున్ని', 'చూసాలే కళ్లార' వంటి పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ తెచ్చుకోవడమే కాకుండా బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటితో పాటే విడుదల చేసిన టీజర్‌కి సైతం అంతటా అనూహ్య స్పందన లభించింది. దీంతో టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే శంకర్ పిక్చర్స్ వారు ఈ చిత్రానికి సంబంధించిన వరల్డ్ వైడ్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారు. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని దర్శకుడు శ్రీధర్ గాదె తెలిపారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - కిరణ్ అబ్బవరం, సంగీతం - చేతన్ భరద్వాజ్, కెమెరా - విశ్వాస్ డేనియల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - భరత్, లిరిక్స్ - భాస్కరభట్ల, క్రిష్ణ కాంత్, ఆర్ట్ - సుధీర్, దర్శకుడు - శ్రీధర్ గాదే.