Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది సాయికుమార్ హీరోగా ఎం. వీరభద్రం దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న విషయం విదితమే. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'కిరాతక' అనే పవర్ఫుల్ టైటిల్‌ని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన పాయల్ రాజ్‌ఫుత్ కథానాయికగా మెరవనుంది.
ఈ సందర్భంగా దర్శకుడు ఎం.వీరభద్రం మాట్లాడుతూ, 'ఆది సాయికుమార్ హీరోగా నేను దర్శకత్వం వహించిన 'చుట్టాలబ్బాయి' సినిమా కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. మరోసారి మా ఇద్దరి కాంబినేషన్లో అద్భుతమైన సినిమా రాబోతోంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ఆది సరసన పాయల్ రాజ్ఫుత్ని హీరోయిన్గా ఎంపిక చేశాం. నిర్మాత నాగం తిరుపతిరెడ్డిగారు ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం, రామ్‌రెడ్డి విజువల్స్ తప్పకుండా సినిమాకి ప్లస్ అవుతాయి' అని చెప్పారు.
'మా విజన్ సినిమాస్ బ్యానర్లో ఆది సాయికుమార్, ఎం.వీరభద్రం కాంబినేషన్లో 'కిరాతక' టైటిల్‌తో ఓ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్‌ని నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చింది. ఆదికి జోడీగా పాయల్ నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ డెఫినెట్‌గా ప్రేక్షకుల్ని ఫిదా చేస్తుంది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభించబోతున్నాం' అని నిర్మాత డా|| నాగం తిరుపతిరెడ్డి తెలిపారు.
ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌ఫుత్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: రామ్‌రెడ్డి, సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తిర్మల్ రెడ్డి యాళ్ల, నిర్మాత: డా. నాగం తిరుపతి రెడ్డి,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎం.వీరభద్రం.