Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రొడ్డకొట్టుడు కమర్షియల్ పాత్రలకు చరమగీతం పాడుతూ స్టార్ హీరోలు సైతం ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. 'ఊపిరి'లో వీల్‌చైర్‌కే పరిమితమైన వాడిగా నాగార్జున, 'రంగస్థలం'లో చెవిడివాడిగా రామ్‌చరణ్, 'టచ్ చేసి చూడు' చిత్రంలో అంధుడిగా రవితేజ నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. అలాగే త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతున్న 'మాస్ట్రో' చిత్రంతో అంధుడిగా నితిన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. స్టార్ హీరోల మాదిరిగానే కథానాయికలూ ఇదే పంథాలో వెళ్తున్నారు. 'నెట్రికన్' చిత్రంతో అగ్ర నాయిక నయనతార అంధురాలిగా కనిపించనుంది. మూసధోరణికి చెక్ పెడుతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో ప్రయోగాలు చేయాల్సిందే అనే ధోరణికి అగ్ర తారలు రావడం ప్రశంసనీయమనే చెప్పాలి. ఇదిలా ఉంటే, వీరి మాదిరిగానే మరో స్టార్ హీరో అల్లుఅర్జున్ (బన్నీ) అంధుడిగా వెండితెరపై మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కబోయే 'ఐకాన్' సినిమాలో అంధుడిగా బన్నీ తన నటనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారని సమాచారం. భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్లు ఇలాంటి పాత్రలను చేస్తుండటంతో సినిమా షూటింగ్‌కి ముందే సర్వత్రా భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఆ అంచనాలకు తగ్గట్టుగానే మెప్పించాలని స్లార్టు కూడా ఛాలెంజ్‌గా తీసుకుంటున్నారు. అల్లుఅర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' చిత్రంలో నటిస్తున్నారు. ఇది రెండు భాగాలుగా రానుంది. తొలి భాగం తర్వాత బాగా గ్యాప్ వస్తుండటంతో 'ఐకాన్' చిత్రాన్ని పూర్తి చేయాలనే నిర్ణయానికి బన్నీ వచ్చారట. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులను దర్శక బృందం వేగవంతం చేసిందని టాక్.