Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ, ఏకంగా మెగాస్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన లక్కీ హీరోయిన్గా బాలీవుడ్ కథానాయిక సోనాక్షి సిన్హా గురించి ఇప్పుడందరూ చెప్పుకుంటున్నారు. చిరంజీవి, బాబీ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం విదితమే. యాక్షన్, ఎమోషన్ కంటెంట్‌తో ఉన్న ఈ కథలో చిరు సరసన కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని చిత్ర బృందం భావించిందట. ఈ నేపథ్యంలో పలువురు కథానాయికల పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్‌గా సోనాక్షిని ఎంపిక చేశారనే వార్తలు హల్చల్ అవుతున్నాయి. దీంతో ఫస్ట్ఛాన్స్లోనే మెగాస్టార్‌తో సోనాక్షి సిల్వర్ స్క్రీన్‌ని షేర్ చేసుకోబోతుండటం విశేషం. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివతో 'ఆచార్య' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో చిరు తనయుడు రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. మోహన్‌రాజా దర్శకత్వంలో మలయాళ సూపర్‌హిట్ సినిమా 'లూసిఫర్' రీమేక్‌లోనూ చిరంజీవి నటిస్తున్నారు.