Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కష్ణ మనవడు, మహేష్‌బాబు మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న చిత్రానికి 'హీరో' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్‌ను మహేష్ బాబు బుధవారం రిలీజ్ చేశారు. నిధి అగర్వాల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
రాజ్ తరుణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'స్టాండప్ రాహుల్'. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్. ఇందులో శ్రేయా రావుగా నటిస్తున్న కథానాయిక వర్షా బొల్లమ్మ ఫస్ట్‌లుక్‌ను బుధవారం చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. రాజ్‌తరుణ్ పోషిస్తున్న పాత్ర మాదిరిగానే వర్ష కూడా ఇందులో స్టాండప్ కమెడియన్ పాత్ర పోషిస్తోంది. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా సాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కంగనా రనౌత్.. విలక్షణ పాత్రలకు, వైవిధ్యమైన చిత్రాలకు పక్కా కేరాఫ్. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంతి, అలనాటి మేటి నటి జయలలిత బయోపిక్ 'తలైవి'లో నటిస్తోంది. అలాగే త్వరలోనే ఇందిరాగాంధీగానూ వెండితెరపై దర్శనమివ్వబోతోంది. 'ఎమర్జనీ' టైటిల్‌తో నిర్మించబోయే ఈ చిత్రంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీగా నటించనుంది. దీనికోసం బుధవారం మేకప్ టెస్ట్ జరిగింది. దీనికి సంబంధించిన ఓ ఫొటోను సోషల్ మీడియా వేదికగా కంగనా అభిమానులతో షేర్ చేసుకుంది.