Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పటికే 'ఆదిపురుష్' వంటి పాన్ ఇండియా సినిమాలో సీతగా నటిస్తూ హాట్ టాపిక్‌గా మారిన కృతిసనన్, లేటెస్ట్గా మరో బంపర్ ఆఫర్‌ని దక్కించుకుంది. హాలీవుడ్లో సంచలన విజయం సాధించిన 'కిల్ బిల్' హిందీ రీమేక్‌కి కృతి పచ్చజెండా ఊపిందని సమాచారం. హాలీవుడ్ క్లాసిక్స్‌లో క్వాంటిన్ టరంటినో డైరెక్ట్ చేసిన 'కిల్ బిల్' సినిమాది అగ్రస్థానం. ఉమ తుర్మన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలై విశేష ప్రేక్షకాదరణతో వరల్డ్‌వైడ్‌గా కాసుల వర్షం కురిపించింది. పెళ్ళి చేసుకోబోతున్న ఓ యువతిని ఐదుగురు యువకులు అత్యాచారం చేస్తారు.
వారిపై ఆ యువతి ఏ తరహాలో పగ తీర్చుకుందనేదే 'కిల్‌బిల్' సినిమా కథ. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో బెస్ట్ రివేంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిందీ చిత్రం. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను నిర్మాత నిఖిల్ ద్వివేది దక్కించుకున్నారు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ 'కిల్ బిల్' స్క్రిప్ట్‌ని బాలీవుడ్ ప్రేక్షకులకు తగ్గట్టుగా రెడీ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగానే ప్రధాన పాత్రలో కృతిని ఎంపిక చేశారని వినిపిస్తోంది. 'మిమి', 'హమ్ దో.. హమారే దో', 'బచ్చన్ పాండే', 'భేడియా' వంటి తదితర చిత్రాల్లో కృతి నటిస్తూనే, 'ఆది పురుష్'లో ప్రభాస్ సరసన మెరవబోతోంది.