Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డబ్బు కంటే అభిమానుల ప్రేమ, ఆదరణ ముఖ్యమని అక్షరాల 150 కోట్ల రూపాయల్ని అగ్ర కథానాయకుడు ప్రభాస్ వద్దనుకున్నారట. 'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్‌కి సర్వత్రా మంచి ఇమేజ్ లభించింది. ఆ ఇమేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి చాలా కంపెనీలు పోటీ పడ్డాయి. తమ కంపెనీ వ్యాపార ప్రకటనల్లో నటిస్తే, భారీ మొత్తం ఇచ్చేందుకు కూడా సిద్ధ పడ్డాయి. అయితే వాటిల్లో నటించడానికి ప్రభాస్ ఏమాత్రం ఆసక్తి చూపలేదట. ఆయనకి వచ్చిన ఆఫర్ల మొత్తం ఈ ఏడాదికి 150 కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ తృణప్రాణంగా ఫ్యాన్స్ కోసం వదిలేశారట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమ కోసం అభిమాన కథానాయకుడు కమర్షియల్ యాడ్స్‌లో నటించడం లేదని, 150 కోట్ల రూపాయల డబ్బుని కూడా లెక్కలోకి తీసుకోలేదని ప్రభాస్ ఫ్యాన్స్ పోస్టుల్లో ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న 'రాధేశ్యామ్' సినిమా విడుదలకు రెడీ అవుతోంది. అలాగే ప్రశాంత్‌నీల్‌తో 'సలార్', ఔం రౌత్‌తో 'ఆదిపురుష్' వంటి పాన్ ఇండియా చిత్రాలు ఇప్పటికే చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీటితోపాటు 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఓ పాన్‌వరల్డ్ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా,
ప్రభాస్ సరసన దీపికా పదుకొనె నటించనుంది.