Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బాలీవుడ్లో ఇకపై మోనోపలి సాగదు. కొందరి ఆధీనంలో ఉన్న బాలీవుడ్‌కి విముక్తి లభించినట్టే. ఓటీటీలతో ప్రపంచంలో వినోదానికి, భారతీయ సినిమా ఎదుగుదలకు మంచి రోజులు వచ్చాయి. ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీసులు వచ్చాక మన దేశంలో విడుదలయ్యే సినిమా కథల్లోనూ మార్పు వచ్చింది. సినీ ప్రపంచంలోనే ఇదొక నూతన అధ్యాయం' అని బాలీవుడ్ కథానాయిక ప్రియాంక చోప్రా అన్నారు.
జీ5 అమెరికాలో నిర్వహించిన వర్చ్యూవల్ సమావేశం ప్రారంభం సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ,'సినిమా ఫార్ములాలో మార్పు వచ్చింది. ఓ ఐదు పాటలు, ఒక ఫైట్... అని గతంలో ఉన్న ఫార్ములా ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం సినీ ప్రేమికులు కొత్త కథలకే పట్టం కడుతున్నారు. ఎంతో ఆశగా ఇండిస్టీలో తమ సత్తా చాటుకుందామని కళాకారులు తిరుగుతుంటారు. కానీ ఇండ్రస్టీలో కొందరి వల్ల వారి కల నిజం కావడం లేదన్నది నిజం. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. మనలో కంటెంట్ ఉంటే చాలు. ప్రపంచం మొత్తం ఆదరిస్తుంది. భారతదేశంలో విడులయ్యే ప్రాంతీయ చిత్రాలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. వెండితెరపై అవకాశాల రాలేదని ఎవ్వరూ నిరుత్సాహ పడొద్దు. ఓటీటీలు మీకు చక్కని అవకాశాల వేదికలు' అని చెప్పారు. ఈ ఏడాది 'ది వైట్ టైగర్' చిత్రంతో ప్రియాంక డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన విషయం విదితమే.