Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రెగ్యులర్ క్యారెక్టర్స్ కంటే ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికేే నేనెక్కువ ఇష్టపడతాను' అని అంటున్నారు యువ హీరో హవీష్. హీరోగానే కాకుండా నిర్మాతగానూ పలు భిన్న చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రవితేజతో 'ఖిలాడి' చిత్రాన్ని నిర్మిస్తున్న హవీష్ పుట్టినరోజు నేడు (శుక్రవారం). ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'ప్రతిసారి నా బర్త్‌డే వేడుకల్ని చిత్ర యూనిట్‌తోపాటు మీడియా మిత్రులతో కలిసి చేసుకునేవాడ్ని. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ ఈ బర్త్‌డే నాకెంతో ప్రత్యేకం. ఎందుకంటే హీరోగా బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు చేయబోతున్నాను. వాటిని కూడా ఈ లాక్డౌన్ టైమ్‌లోనే ఫైనల్ చేశాను. ఫస్ట్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాను. దాని తర్వాత యాక్షన్ లవ్‌స్టోరీ చేస్తాను. అలాగే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక యాక్షన్ మూవీ చేయబోతున్నాను. ఈ మూడు వేటికవే భిన్నమైన స్క్రిప్ట్స్. ఈ మూడు సినిమాలు హీరోగా నన్ను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్తాయనే నమ్మకం ఉంది. నటుడిగా నన్ను నేను ఫ్రూవ్ చేసుకోవడానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. అందుకే మొదట్నుంచి నా సినిమాలన్ని చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అలాగే రాబోయే సినిమాలు కూడా ఇదే పంథాలో ఉంటాయి. హీరోగా నటిస్తూనే నిర్మాతగా ప్రొడక్షన్ వ్యవహారాలు కూడా చూస్తున్నాను. మంచి టీమ్‌తో ఈ రెండింటినీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్నాను. హీరోగానే కాకుండా నిర్మాతగానూ పరిశ్రమలో నాకంటూ ఓ మార్క్ ఉండాలని ప్రయత్నిస్తున్నాను. అలాగే నిర్మాణ పరంగా, విద్యాపరంగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఒక స్టూడియో, అలాగే ఒక యూనివర్సిటీని కూడా ప్లాన్ చేస్తున్నాం. స్టూడియోలో పవన్‌కళ్యాణ్, రవితేజ సినిమాలకి సెట్స్ వేశాం. అక్కడే గ్రీన్ స్క్రీన్ స్టూడియో కూడా కట్టబోతున్నాం. ఇక యూనివర్సిటీ విషయానికి వస్తే, ఆసియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీగా ఉండేలా చేయబోతున్నాం. ఇది నా డ్రీమ్ మాత్రమే కాదు మా తాతయ్య, మా నాన్నగారి లెగసీని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. రవితేజ నటిస్తున్న 'ఖిలాడి' ఆయన కెరీర్లోనే ఇంతవరకూ చూడని స్టైలీష్ థ్రిల్లర్‌గా ఉండబోతుంది. అక్షరు కుమార్‌తో 'రాక్షసుడు' సినిమా రీమేక్ చేయాల్సి ఉంది. అయితే ఈ కరోనా కారణంగా ఆ రైట్స్‌ని ఆయనకే ఇచ్చాం. 'ఖిలాడి' పూర్తవగానే వెంటనే ఒక స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేశాం. ఇక నుండి ఏ స్టూడియోస్, హవీష్ ప్రొడక్షన్స్‌లో పెద్ద హీరోలతోనే ఎక్కువ సినిమాలు చేయబోతున్నాం' అని చెప్పారు.