Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కిక్ ఇచ్చింది
'దర్శకుడు లింగుస్వామి చెప్పిన ఫైనల్ వర్షెన్ ఫుల్ కిక్ ఇచ్చింది. వావ్.. అనేలా అద్భుతంగా కథని నెరేట్ చేశారు. నేను షూటింగ్‌కి రెడీ' అంటూ హీరో రామ్ ఎంతో ఎగ్జైటెడ్‌గా ఓ పోస్ట్‌ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
రామ్ హీరోగా ఎన్.లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్‌కి జోడిగా 'ఉప్పెన' ఫేమ్ కతిశెట్టి నటిస్తోంది.
సిని 'మా' బిడ్డలు
త్వరలో జరగబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పోటీకి ప్రకాష్‌రాజ్ పోటీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన గురువారం తన ప్యానెల్‌ని అధికారికంగా మీడియాకి తెలిపారు.
'సిిని'మా' బిడ్డలం..మనకోసం మనం..'మా' కోసం మనం.. అని ఎన్నికల్లో బరిలో నిల్చుంటున్నాం. 'మా' శ్రేయస్సు దష్ట్యా నిర్మాణాత్మక ఆలోచనలను, ఆచరణలో పెట్టే దిశగా మా ప్రతిష్టకోసం, మన నటీనటుల బాగోగుల కోసం, పదవులు కాదు పనులు మాత్రమే చేయటం కోసం..సినిమా నటీనటులందరి ఆశీస్సులతో, అండదండలతో ఎన్నికలలో పోటీ చేస్తున్నాం' అని ప్రకాష్‌రాజ్ అన్నారు. అలాగే జయసుధ, శ్రీకాంత్, బెనర్జీ, సాయికుమార్, తనీష్, ప్రగతి, అనసూయ, సన, అనిత చౌదరి, సుధ, అజరు, నాగినీడు, బ్రహ్మాజీ, రవిప్రకాష్, సమీర్, ఉత్తేజ్, బండ్ల గణేష్, ఏడిద శ్రీరామ్, శివారెడ్డి, భూపాల్, టార్జ్షన్, సురేష్ కొండేటి, ఖయ్యుం, సుడిగాలి సుధీర్, గోవిందరావు, శ్రీధర్‌రావుతోపాటు మరికొందరు ప్రముఖులు ఉండబోయే తన ప్యానెల్ మెంబర్స్‌ని సిని'మా'బిడ్డలు పేరుతో ప్రకాష్‌రాజ్ ప్రకటించారు.
వరుడు.. నరుడు రీస్టార్ట్ చేశారు
తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్టైన్మెంట్స్'. ఈ సంస్థ నిర్మిస్తున్న 'వరుడు కావలెను', 'నరుడి బ్రతుకు నటన' సినిమాల చిత్రీకరణ గురువారం పున: ప్రారంభమైంది. నాగశౌర్య, రీతువర్మ జంటగా రూపొందుతున్న చిత్రం 'వరుడు కావలెను'. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్ర చివరి షెడ్యూల్ ఆరంభమైంది. హీరో, హీరోయిన్లు నాగ శౌర్య, రీతువర్మపై ఓ సందర్భోచిత గీతాన్ని నత్య దర్శకుడు శేఖర్ మాస్టర్ నేతత్వంలో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో పాటు మరికొన్ని సన్నివేశాల చిత్రీకరణతో సినిమా మొత్తం పూర్తవుతుంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా నటిస్తున్న సినిమా 'నరుడి బ్రతుకు నటన'. హీరో సిద్ధు పాల్గొనగా కొన్ని సన్నివేశాల చిత్రీకరణతో గురువారం తాజా షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ సినిమాతో విమల్ కష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ రెండు చిత్రాలకు సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్య దేవర నాగవంశీ.
ఎస్పీ మ్యూజిక్..
అగ్ర నిర్మాత డా|| డి.రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ చిత్ర నిర్మాణ సంస్థ 'ఎస్పీ మ్యూజిక్' అనే కొత్త మ్యూజిక్ లేబుల్‌ను ప్రారంభించి సంగీత పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 'మ్యూజిక్ అనేది మన సినిమాలకు హదయం లాంటిది. అందుకే దాన్ని సొంతంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరాన్ని మేం గుర్తించాం. సురేష్ ప్రొడక్షన్స్ వారసత్వాన్ని కొనసాగించేలా 'ఎస్పీ' మ్యూజిక్ ఉండబోతోంది. మంచి సంగీతాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక వేదికగా ఉపయోగపడాలని, అలాగే సంగీత శక్తి కేంద్రంగా ఏర్పడాలనేది మా లక్ష్యం' అని నిర్మాత డి.సురేష్‌బాబు చెప్పారు.