Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రూపొందుతున్న నయా చిత్రం 'హను-మాన్'. ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కి నిర్మాత సి. కళ్యాణ్ క్లాప్ కొట్టగా, మరో నిర్మాత జెమిని కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి షాట్‌కు శివశక్తి దత్త గౌరవ దర్శకత్వం వహించారు. జులై నుండి ఈ చిత్ర రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. అత్యాధునిక విఎఫ్ఎక్స్తోపాటు ప్రతిభగల నటీనటులు, అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ బర్త్ డే సందర్భంగా ఇటీవల విడుదలైన ఈ చిత్ర టైటిల్ టీజర్ మంచి స్పందన రాబట్టుకుంది. 'జాంబిరెడ్డి' తర్వాత తేజ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రానికి నిర్మాత: కె. నిరంజన్ రెడ్డి, సమర్పణ: శ్రీమతి చైతన్య, స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్స్ విల్లే, డిఒపి: దాశరథి శివేంద్ర, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగల, రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ.