Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లేడీ సూపర్‌స్టార్ నయనతార బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టు వినిపిస్తోంది. షారూఖ్ ఖాన్, అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఆమెని నాయికగా ఎంపిక చేశారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తయ్యింది. షారూఖ్ ద్విపాత్రాభినయం చేయబోతున్న ఈ చిత్రంలో నాయికగా నయనతారని సెలెక్ట్ చేశారట. అట్లీ దర్శకత్వంలో రూపొందిన 'రాజా రాణి', 'బిగిల్' చిత్రాల్లో నయన నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 'నెట్రికన్', 'అన్నాత్తే' వంటి చిత్రాల్లోనూ నయనతార నటిస్తోంది.