Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాబీ సింహా హీరోగా రూపొందుతున్న త్రిభాషా చిత్రం 'వసంత కోకిల'. నిర్మాత రామ్ తళ్లూరి నిర్మాణ సారధ్యంలో నూతన దర్శకుడు రమణన్ పురుషోత్తమ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో బాబీ సింహాకి జోడిగా కాశ్మీర పర్దేశీ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ విశేష ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రామ్ తళ్లూరి మాట్లాడుతూ,''వసంత కోకిల' టైటిల్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా పై ప్రేక్షకులతో పాటు ఇండిస్టీ ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి పెరిగింది. తాజాగా రిలీజైన టీజర్ అన్ని వర్గాల అభిమానుల ఆదరణ అందుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. డైలాగ్స్ లేకుండానే కేవలం విజువల్స్‌తోనే ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ టీజర్‌ని కట్ చేసిన తీరుకి అందరూ ఫిదా అయిపోయారు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమా జోనర్‌కి, బాబీ సింహా అత్యుత్తమ పర్ఫార్మెన్స్కి తగిన విధంగానే దర్శకుడు రమణన్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. జాతీయ అవార్డు గ్రహిత, విలక్షణ కథానాయకుడు కమల్‌హాసన్, శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన 'వసంత కోకిల' ఏ రేంజ్ సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలోనూ మరో జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా నటించడం విశేషంగా భావిస్తున్నాం. థింక్ మ్యూజిక్ వారు మా సినిమా ఆడియో రైట్స్ దక్కించుకున్నారు' అని చెప్పారు. బాబీ సింహా, కాశ్మీర పర్దేేశీ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ - రాజేశ్ మురుగేశన్, డిఓపి - గోపీ అమరనాథ్, ఎడిటర్ - వివేక్ హర్షన్, లిరిక్స్ - చంద్ర బోస్, డైలాగ్స్ - రాజేష్.ఎ.మూర్తి, నిర్మాతలు - రజనీ తళ్లూరి, రేష్మీ సింహా, రచన, దర్శకత్వం - రమణన్ పురుషోత్తమ.