Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత కొన్ని రోజులుగా కథానాయిక తమన్నా బుల్లితెరపై మెరవబోతుందనే గాసిప్స్
బాగా వైరల్ అయ్యాయి. అయితే అవి నిజమేనని తమన్నా క్లారిటీ ఇచ్చేసింది. వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రంగం సిద్ధమైందనే విషయాన్ని శనివారం ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ ఫొటోతో తమన్నా చెప్పకనే చెప్పింది. ఓ ప్రముఖ టీవీ ఛానెల్లో ప్రసారం కానున్న 'మాస్టర్ చెఫ్ ఇండియా తెలుగు' అనే కార్యక్రమంలో హోస్ట్‌గా తమన్నా సందడి చేయనుంది. షఉట్కి సిద్ధమవుతున్నప్పుడు తీసిన ఒక ఫొటోను తమన్నా అభిమానులతో షేర్ చేసుకుంటూ మాస్టర్ చెఫ్ తెలుగు.. త్వరలో రాబోతోంది అంటూ క్యాప్షనూ పెట్టింది. దీంతో తమన్నా బుల్లితెర ఎంట్రీ ఖాయమని వేరే చెప్పక్కర్లేదు. ఇదే షోని విజరు సేతుపతి హోస్ట్‌గా తమిళంలో, పథ్వీరాజ్ హోస్ట్‌గా మలయాళంలో చేయబోతున్నారట. తమన్నా ప్రస్తుతం 'ఎఫ్3', 'మాస్ట్రో', 'సీటీమార్', 'గుర్తుందా సీతాకాలం' వంటి తదితర చిత్రాల్లో నటిస్తోంది.