Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లేటెస్ట్గా గ్రీన్‌సిగల్ ఇచ్చిన 'బీస్ట్' సినిమా కోసం అందాల తార పూజా హెగ్డే రంగంలోకి దిగింది. విజరు కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం 'బీస్ట్'. విజరు బర్త్‌డే నేపథ్యంలో ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన పోస్టర్లు, వాటిల్లోని విజరు లుక్.. ఇదొక ఫుల్ ఫ్యాక్డ్ యాక్షన్ సినిమా అని తెలియజేస్తున్నాయి. జూలై 1 నుంచి 6 రోజుల పాటు ఓ పాటని చైన్నెలో చిత్రీకరించబోతున్నారు. ఇందులో భాగంగా శనివారం డాన్స్ రిహారల్స్లో పూజా పాల్గొంది. ట్విట్టర్ ఖాతా ద్వారా రిహార్సల్స్ చేస్తున్న ఓ ఫొటోని పూజా తన అభిమానులతో షేర్ చేసుకుంది. పూజా ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌తో 'భాయిజాన్', రణ్‌వీర్‌సింగ్‌తో 'సర్కస్', రామ్‌చరణ్ సరసన 'ఆచార్య', ప్రభాస్‌కి జోడిగా 'రాధేశ్యామ్', అఖిల్ కాంబినేషన్లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి చిత్రాల్లో భిన్న పాత్రలు పోషిిస్తోంది.