Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళ స్టార్ కథానాయకుడు ధనుష్ ఇప్పటికే ఓ స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటిస్తున్న విషయం విదితమే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దాదాపు 100 కోట్లకి పైగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కబోతోందని సమాచారం. అలాగే ఈ సినిమాకి ధనుష్ ఏకంగా 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌ని తీసుకుంటున్నారనే వార్తలూ హల్చల్ చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ధనుష్ మరో తెలుగు సినిమా చేసేందుకు గ్రీన్‌సిగల్ ఇచ్చారని వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మైంట్స్ సంస్థ పాన్ ఇండియా రేంజ్‌తో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోందట. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించే అవకాశం పుష్కలంగా ఉన్నట్టు సమాచారం. ఇటీవల నితిన్, కీర్తిసురేష్‌తో ఇదే బ్యానర్లో వెంకీ అట్లూరి 'రంగ్ దే' చిత్రాన్ని రూపొందించారు. దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పిన ఓ లైన్ ధనుష్‌కి బాగా నచ్చిందట. దీంతో ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాకి సైతం ధనుష్ తీసుకునే పారితోషికం మాత్రం అధిక మొత్తంలో ఉండొచ్చనే ఊహాగానాలు ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు, తమిళంతోపాటు జాతీయంగా, అంతర్జాతీయంగా ధనుష్‌కి ఉన్న ఇమేజ్ దృష్ట్యా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కూడా ఆయనకు సాలిడ్ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందట.