Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమలాపాల్, రాహుల్ విజరు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'కుడి ఎడమైతే..'.
ఈ సిరీస్ త్వరలోనే 'ఆహా' ఓటీటీలో ప్రసారం కానుంది.ఇండియాలో డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రసారమవుతున్న తొలి సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇది. రామ్ విఘ్నేశ్ నిర్మించిన ఈ సిరీస్ను 'లూసియా', 'యూ టర్న్' వంటి హిట్ చిత్రాల దర్శకుడు పవన్ కుమార్ తెరకెక్కించారు. శనివారం విడుదల చేసిన ఈ సిరీస్ మోషన్ పోస్టర్లో గోడపై అతికించిన నోటీసులు, గన్, గడియారం వంటి విజువల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఇందులో విజ్ఞత లేని క్రూరమైన పోలీస్ ఆఫీసర్గా అమలాపాల్, డెలివరీ బారుగా రాహుల్ విజరు నటించారు. భిన్నమైన రంగాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను జీవితం ఎలా కలిపింది?, సైంటిఫిక్ అంశాలు ఈ క్రైమ్ థ్రిల్లర్లో ఎలా వచ్చాయి? అనే అంశాలతో ఈ సిరీస్ రూపొందింది.