Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గత రెండేండ్లుగా గంగూభాయ్గా చేస్తున్న ప్రయాణం ఈ రోజుతో ముగిసింది. నా జీవితంలో 'గంగుభాయి కతియావాడి' సినిమా చాలా ప్రత్యేకం. ఇంతటి ప్రత్యేకమైన సినిమాని, జీవితాంతం గుర్తుపెట్టుకునే ఈ ప్రయాణాన్ని నాకు ఇచ్చిన దర్శకుడు సంజరు లీలా భన్సాలీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు' అంటూ కథానాయిక అలియాభట్ ఎంతో ఎమోషనల్గా ట్వీట్ చేశారు. 2019 డిసెంబర్ 8న 'గంగుభాయి కతియావాడి' సినిమా షూటింగ్ ఆరంభమై ఆదివారంతో ముగిసింది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఈ సినిమా కోసం వేసిన సెట్లో చిత్ర యూనిట్ సభ్యులందరూ హాజరయ్యారు. వీడ్కోలు నేపథ్యంలో గంగుభాయి పాత్రతో చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని, కోవిడ్ పరిస్థితుల్ని గుర్తు చేసుకుంటూ అలియా భావోద్వేగానికి గురయ్యారు.