Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం 'ఇందువదన'. ఎం.ఎస్.ఆర్. దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో వరుణ్ సందేశ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు.
నాయకానాయికల పాత్రలకు సంబంధించి లుక్స్‌ని ఆదివారం చిత్ర బృందం రిలీజ్ చేసింది.
'ఇటీవల విడుదలైన 'ఇందువదన' ఫస్ట్‌లుక్ కళాత్మకంగా ఉండటంతో అనూహ్యమైన స్పందన లభించింది. కథాపరంగా వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్‌ని దర్శకుడు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. అలాగే ఈ సినిమా కోసం వరుణ్ సందేశ్ తనని తాను కొత్తగా ఆవిష్క రించుకున్న తీరు అందర్నీ సర్ప్రైజ్ చేస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన వరుణ్ సందేశ్ పోషిస్తున్న వాసు పాత్ర లుక్, అలానే ఫర్నాజ్ శెట్టి నటిస్తున్న ఇందు పాత్ర లుక్‌కి ట్రెమండెస్ రెస్పాన్స్ వస్తోంది. టైటిల్పరంగానే కాకుండా పాత్రల పరంగా రిలీజ్ చేసిన లుక్స్ సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. దీంతో సినిమాపై అందరిలోనూ అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉంటుంది. హైదరాబాద్ సారథి స్టూడియోస్‌లో వేసిన భారీగా సెట్స్‌లో చిత్రీకరించిన క్లైమాక్స్ అద్భుతంగా వచ్చింది. సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి కథ, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా, శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్,
బి.మురళికష్ణ సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు దర్శక, నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.