Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినిమాలు చేసే విషయంలో కథానాయకుడు రవితేజ పక్కాప్లానింగ్‌తో వెళ్తున్నారు. ఇటీవల 'క్రాక్' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం 'ఖిలాడి' చిత్రంలో నటిస్తున్నారు.
అలాగే శరత్ మండవ దర్శకత్వంలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి గ్రీన్‌సిగల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా యూనిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇంతవరకూ చూడని ఓ సరికొత్త పాత్రలో రవితేజని దర్శకుడు శరత్ మండవ ఈ చిత్రంలో చూపించబోతున్నారు.
దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జూలై 1 నుండి హైదరాబాద్‌లోని అల్యుమినియం ఫ్యాక్టరీలో ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్లో టీమ్ అందరూ పాల్గొననున్నారు. వెంకటేష్, అజిత్, కమల్‌హాసన్, మోహన్‌లాల్ వంటి స్టార్ హీరోల సినిమాలకు రచయితగా పని చేసిన శరత్ మండవ ఈ చిత్రంతో దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు.
రవితేజ, దివ్యాంశ కౌశిక్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత: సుధాకర్ చెరుకూరి, సంగీతం: స్యామ్ సీఎస్, సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్, ఆర్ట్: సాయి సురేష్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ.