Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఎవరూ సృజించని, వెలికితీయని జోనర్ నుంచి ఓ కథను తీసుకువస్తోంది సోనీ లివ్. త్వరలో రాబోయే సోనీ లివ్ ఒరిజినల్ ‘రాకెట్ బాయ్స్’ అనేది భారతదేశానికి చెందిన తెలివైన న్యూక్లియర్ ఫిజి
క్సిస్ట్స్ జీవితాలను నాటకీయంగా చిత్రీకరించింది. హోమీ బాబా, విక్రమ్ సారాభాయ్ ల కథను ఇది వర్ణిస్తుంది. గొప్పదనాన్ని సాధించేందుకు వారు చేసిన ప్రయాణాన్ని వివరిస్తుంది. చరిత్రలో వారి స్థా నాన్ని తెలియజేస్తుంది. ఈ ఇద్దరు గొప్ప వ్యక్తులు వారికి గల ముందుచూపునకు మాత్రమే గాకుండా తమ కలలను నిజం చేసుకునే ధైర్యానికి కూడా ప్రతీకలు. అత్యంత గొప్ప శాస్త్ర ఆవిష్కరణలకు వారు బాట వేశారు. నిఖిల్ అద్వానీ, రాయ్ కపూర్ ఫిల్మ్స్, ఎమ్మే ఎంటర్ టెయిన్ మెంట్ దీన్ని రూపొం దించాయి. అభయ్ పన్ను, నిఖిల్ అద్వాని దర్శకత్వం వహించారు. సిద్దార్థ్ రాయ్ కపూర్, మోనిషా అద్వాని, మదు భోజ్ వాణి, నిఖిల్ అద్వాని నిర్మాతలు. ఇది మనల్ని పాతకాలానికి తీసుకెళ్తుంది. వారి గొప్పదనాన్ని, ఔచిత్యాన్ని అర్థం చేసుకునేందుకు వీలుగా వారి వ్యక్తిత్వాలను మన కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది.
ఇష్వాక్ సింగ్ విక్రమ్ ఎ సారాభాయ్ గా, హోమి జె బాబాగా జిమ్ సర్బ్ నటించారు.
జిమ్ సర్బ్: “ఈ వింత కాలంలో సైన్స్, శాస్త్రీయ పరిశోధన, వినూత్నమైన, బహుశా ప్రాణాలను రక్షించే సాంకేతికత ఆశ్చర్యకరంగా స్పష్టమవుతుంది. ‘రాకెట్ బాయ్స్’ భారతీయ శాస్త్రీయ చరిత్రలో చిహ్నాలు విక్రమ్ సారాభాయ్, హోమి భాభా. శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఆవిష్కర్తలుగా వారి జీవితాలు భవిష్యత్తు తరాలకు ఆదర్శం. నేను సోనీలైవ్లో దాని ప్రీమియర్ కోసం ఎదురు చూస్తున్నాను.''
ఇష్వాక్ సింగ్: ‘‘విక్రమ్ సారాభాయ్ లాంటి నిజ జీవిత పాత్రను నటించే అవకాశాన్ని తరచూ పొందలేం.ఆ పాత్రను పోషించడాన్ని ఒక కళాకారుడిగా మాత్రమే గాకుండా, ఐకానిక్ శాస్త్రవేత్తల వార సత్వాన్ని ఎంతో గర్వకారణంగా భావిస్తున్న భారతీయుడిగా కూడా దీన్ని చూస్తున్నాను. రాకెట్ బాయ్స్ అనేది నిఖిల్ అద్వానీతో నా రెండో షో. ఈ పాత్రకు నన్ను ఎంచుకున్నందుకు గాను జట్టుకు నా ధన్యవాదాలు’’.