Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్ హీరోగా నటిస్తున్న తన 30వ చిత్రానికి 'ఒకే ఒక జీవితం' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. నూతన దర్శకుడు శ్రీ కార్తిక్ దర్శకత్వంలో ఈ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ సంభాషణలు అందించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. సోమవారం ఈ చిత్ర టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. బ్యాక్ షాట్లో శర్వానంద్ గిటార్‌తో ఉన్న ఈ పోస్టర్లో ఒక వైపు పచ్చదనం, పోస్టాఫీసు, లేఖ, మ్యూజిక్ క్యాసెట్, గాలిపటాలు, మరొక వైపు కర్మాగారాలు, సెల్ టవర్, మొబైల్, మ్యూజిక్ సిస్టమ్, ఫ్లైట్‌ని చూపించారు. ప్రపంచీకరణ ప్రభావాన్ని వివరించేలా ఈ పోస్టర్ ఉండటం విశేషం.'తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సై-ఫై ఎలిమెంట్స్‌తో, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యూత్‌కి కూడా నచ్చే విధంగా ఉండబోతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌లో శర్వానంద్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. వాళ్ళకి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. శర్వానంద్ సరసన తెలుగమ్మాయి రీతు వర్మ హీరోయిన్గా నటించింది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి సపోర్టింగ్ రోల్స్ పోషించిన ఈ చిత్రంలో అక్కినేని అమల ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆమె పాత్ర అందర్నీ మెప్పిస్తుంది' అని మేకర్స్ చెప్పారు.
ఈ చిత్రానికి మాటలు: తరుణ్ భాస్కర్, డిఓపి: సుజిత్ సారంగ్, సంగీతం: జేక్స్ బిజోరు, ఎడిటర్: శ్రీజీత్ సారంగ్, ఆర్ట్: ఎన్.సతీష్ కుమార్, స్టంట్స్: సుదేశ్ కుమార్, లిరిక్స్: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కష్ణకాంత్, రచన, దర్శకత్వం: శ్రీ కార్తిక్.