Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సందీప్ కిషన్, నేహాశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం 'గల్లీ రౌడీ'. రచయిత కోన వెంకట్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడమే కాకుండా స్క్రీన్‌ప్లే కూడా అందించారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని, సెన్సార్‌కి సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు ఈ సినిమా గురించి మాట్లాడుతూ, 'ఇప్పటి వరకు సందీప్ కిషన్ చేయనటువంటి డిఫరెంట్ పాత్రను
ఈ సినిమాలో చేశారు. సినిమా అద్భుతంగా వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా ఎంత హిలేరియస్‌గా ఉంటుందనే విషయాన్ని రివీల్ చేసి, అద్భుత రెస్పాన్స్ని రాబట్టుకుంది. హీరో, హీరోయిన్ల మధ్య సాగే లవ్ మాంటేజ్ సాంగ్ 'పుట్టనే ప్రేమ...'కు మంచి స్పందన వచ్చింది.
ఫన్ రైడర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడం ఖాయం. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'ఛలో' వంటి చిత్రాల్లో నటించి, మెప్పించిన మైమ్ గోపి ఈ చిత్రంలో విలన్‌గా నటించారు. రాజేంద్రప్రసాద్,
బాబీ సింహ పోషించిన కీలక పాత్రలు అద్భుతంగా వచ్చాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం' అని తెలిపారు.