Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినిమాలు చేసే విషయంలో మెగాస్టార్ దూకుడు పెంచారు. ప్రస్తుతం ఆయన 'ఆచార్య' సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సినిమా ముగింపు దశలో ఉండగానే, చిరు మరో చిత్రానికి సంబంధించిన పనుల్ని వేగవంతం చేశారు. మలయాళంలో సంచలన విజయం సాధించిన 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్‌లో మోహన్‌రాజా చేసిన మార్పులు, చేర్పులు నచ్చడంతో మెగాస్టార్ తదుపరి పనులకు గ్రీన్‌సిగల్ ఇచ్చారు. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 153వ చిత్రానికి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ సోమవారం మొదలయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు మోహన్‌రాజా, సంగీత దర్శకుడు తమన్ సోషల్‌మీడియాలో ఓ ఫొటోని అభిమానులతో షేర్ చేసుకున్నారు. తన కల నిజమైందని, మెగాస్టార్ ప్రాజెక్ట్ చేస్తుండటం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని దర్శకుడు మోహన్‌రాజా ట్వీట్లో తెలిపారు.ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆర్.బి.చౌదరి, ఎన్వీ.ప్రసాద్ నిర్మాతలు. చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న 'ఆచార్య' సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే, ఈ సినిమా షూటింగ్‌ని ఆరంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మెగాస్టార్ మాస్ ఇమేజ్‌ని దష్టిలో ఉంచుకుని దర్శకుడు మోహన్‌రాజా జోడించిన కమర్షియల్ ఎలిమెంట్స్ విషయంలో చిరంజీవి చాలా సంతప్తిగా ఉన్నట్టు చిత్ర బృందం చెబుతోంది. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అలాగే ఈ చిత్రంలో నటించే నటీనటులు, పని చేయబోయే సాంకేతిక నిపుణుల జాబితా సైతం అటు ప్రేక్షకుల్ని, ఇటు చిరంజీవి అభిమానుల్ని సర్ప్రైజ్ చేసేలా ఉంటుందని, సంగీత దర్శకుడు తమన్ సైతం మెగాస్టార్ మాస్ ఇమేజ్‌కి తగ్గట్టుగానే అద్భుతమైన ట్యూన్స్‌ని కంపోజ్ చేస్తున్నారని, తన కెరీర్లోనే ఈ సినిమా ఓ మైల్‌స్టోన్‌గా నిలిచేందుకు ఆయన కృషి చేస్తున్నారని చిత్ర బృందం తెలిపింది.