Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్ నటిస్తున్న నూతన చిత్రం 'నారప్ప'. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ, 'ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, పోస్టర్స్‌తో పాటు వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ వారు సినిమా చూసి యూనిట్ సభ్యులను ప్రశంసించారు. యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. వెంకటేష్‌ను ఇంతవరకూ మనం చూడని ఒక కొత్త అవతారంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చూపించబోతున్నారు. ఆయన మేకింగ్ స్టయిల్ ఈ సినిమాకి బిగ్ ఎసెట్ కానుంది' అని చెప్పారు. వెంకటేష్, ప్రియమణి, కార్తిక్ రత్నం, రావు రమేష్, రాజీవ్ కనకాల తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్ని పోషించారు.