Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా పాన్ ఇండియా సినిమా 'ఆర్ఆర్ఆర్' రిలీజ్‌కి సంబంధించి వస్తున్న రకరకాల వార్తలకు, ఊహాగానాలకు 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం ఎట్టకేలకు చెక్ పెట్టింది. అక్టోబర్ 13.. ప్రకటించిన తేదీకే దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు మేకర్స్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. 'ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్లో ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్' (రణం రౌద్రం రుధిరం). ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. స్వాతంత్య్ర సమర యోధులు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా చిత్రమిది. హైదరాబాద్‌లోని పలు ప్రదేశాల్లో భారీ సెట్స్ వేసి చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ప్రేక్షకులను స్వాతంత్య్ర పోరాట పూర్వ కాలానికి తీసుకెళ్తుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు పాటలు మినహా టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ రెండు పాటల చిత్రీకరణతో సినిమా మొత్తం పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇప్పటికే తెలుగు, తమిళ భాషలకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు. త్వరలోనే మిగిలిన భాషల డబ్బింగ్‌ను కూడా పూర్తి చేయడానికి సన్నద్ధమవుతున్నారు. సెట్స్‌లో కోవిడ్ ప్రొటోకాల్‌ను పాటిస్తూ, తగు జాగ్రత్తలను తీసుకుంటూ దర్శకుడు రాజమౌళి శరవేగంగా చిత్రీకరణ పనులు పూర్తి చేస్తున్నారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అలియా భట్, అజరు దేవగన్, హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, రేస్టీవెన్ సన్, అలిసన్ డూడి తదితరులు నటిస్తున్నారు. రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోవిడ్ పరిస్థితులకు అనుగుణంగా ఈ సినిమాని దసరా సందర్భంగా అక్టోబర్ 13న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.